Funny Questions And Answers In Telugu | చిలిపి ప్రశ్నలు

Funny Questions And Answers In Telugu | చిలిపి ప్రశ్నలు


చిలిపి ప్రశ్నలు | Funny Questions And Answers In Telugu


1) ఎవరైనా సినిమా హీరో కావాలంటే ఎం చేయాలి ? 

సినిమా తీసుకోవాలి  😂


2) చిలక జోశ్యం ఎలా చెబుతుంది ?

ముక్కుతో కార్డు తీసి  😂


3) ప్రపంచాన్ని తక్కువ ధరలో చూడటం ఎలా ?

అట్లాస్ కొనుక్కొని  😂


4)  పశువులు గడ్డెందుకు మేస్తాయి ?

నోరుంది కాబట్టి  😂


5) గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది ఎలా చెప్పగలం ?

నోటితో  😂


6) చింటూ 8 డేస్ నిద్రపోకుండా ఉన్న ఆరోగ్యంగానే ఉన్నాడు ఎలా ?

రాత్రిపూట పడుకుని 😂


7) ఒక ఖాళీ డబ్బాలో ఎన్నిపెన్నులు పెట్టగలం ?

ఒక్కటే: ఎందుకంటే, ఒక పెన్ను పెట్టగానే అది ఖాళీగా ఉండదుగా  😂


8) ఒక వ్యక్తి విమానం లోంచి పారాషూట్ లేకుండా కిందికి దూకిన ఏమి కాలేదు ఎలా ?

విమానం ల్యాండ్ అయి ఉంది 😂


9) మన దేశంలో ప్రజలు ఎక్కువగా ఎక్కడ గుండు కొట్టించుకుంటారు ?

తలమీద 😂 😂


10) దూరపు కొండలు నునువుగా ఎందుకు కనిపిస్తాయి ?

చూస్తాం కాబట్టి  😂


11) ఆగకుండా 60 నిముషాలు పరిగెత్తితే ఏమౌతుంది ?

గంట అవుతుంది  😂


12) గుడికెళ్ళి బొట్టు దేనికి పెట్టుకుంటారు ?

నుదిటికి 😂


13) గుర్రానికి ముందు ఏనుగుకి వెనకాల ఉండేది ఏమిటి ?

'గు' అక్షరం  😂


14) మన టైం బాగుండాలంటే ఎం చేయాలి ?

'వాచ్' శుభ్రం చేసుకోవాలి 😂


15) ఫస్ట్ రాంక్ రావాలంటే పరీక్షలు ఎలా రాయలి ?

పెన్నుతో 😂


16) వీసా అడగని దేశం ?

సందేశం 😂


17) డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ముఖానికి గుడ్డ ఎందుకు కట్టుకుంటారు ?

ఎవరు చేసారో తెలియకూడదని  😂


18) కొత్త చెప్పులు కొనగానే ఎక్కడికి వెళ్ళడానికి భయపడతారు ?

గుడికి  😂


19) అందరు భయపడే బడి ? 

చేతబడి  😂


20) కిందకి వస్తుంది కానీ పైకి వెళ్ళదు ఏమిటి ?

వాన  😂


21) 3 పిల్లులు ఎలుకలను 3 నిమిషాల్లో చంపితే, 100 ఎలుకలను చంపడానికి 100 పిల్లులకు ఎంత సమయం పడుతుంది?

'3 నిముషాలు' 😂


22) మీరు ఒక రేసులో పరిగెడుతున్నారు, అయితే రేసులో మీరు రెండవ నంబర్ వాడిని దాటారు, అప్పుడు మీరు ఏ స్థానంలోకి వస్తారు?

రెండో స్థానం ( ఎందుకంటే దాటింది రెండో వాడిని మొదటి స్థానం వాడిని కాదు ) 😂😂


23)  మీ చేతిలో 1 కిలో ఇనుము, మరో చేతిలో 1 కిలో పత్తి ఉంటే, వీటిలో ఏది ఎక్కువ బరువు ఉంటుంది?

రెండూ సమానంగా ఉంటాయి. ( ఎందుకంటే రెండూ 1 కిలో కదా) 😂


24) మీ జేబులో 10 చాక్లెట్లు ఉన్నాయి, మీరు మీ జేబులో నుండి రెండు చాక్లెట్లు తీసుకున్నారు, అయితే మీ దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉంటాయి?

10, ( ఎందుకంటే తీసుకున్న చాక్లెట్లు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయిగా ) 😂


25) రాముడు మరియు సీత మధ్యలో ఏముంది?

మరియు 😂😂


27) ఒక ఎత్తయిన చెట్టుపై నుండి కోడిపుంజు గుడ్డు పెడితే కింద పడి పగులుతుందా, లేదా ?

కోడిపుంజు గుడ్డు పెట్టదు 😂

Chilipi-Prashnalu-in-telugu


Post a Comment

Previous Post Next Post